TERROR: మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా " సైదా బేగం " కుట్ర

TERROR: మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా  సైదా బేగం  కుట్ర
X
విజయవాడ టెర్రర్ లింక్ లో సంచలనాలు... విచారణలో సైదా బేగం బాగోతాలు... మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా కుట్ర

వి­జ­య­వాడ టె­ర్ర­ర్ లిం­క్ కే­సు­లో కొ­త్త మలు­పు­లు తి­రు­గు­తు­న్నా­యి. ఈ కే­సు­లో అరె­స్టైన హై­ద­రా­బా­దు­కు చెం­దిన సైదా బేగం వి­చా­ర­ణ­లో సం­చ­లన వి­ష­యా­లు వె­లు­గు­లో­కి రా­వ­డం­తో భద్ర­తా సం­స్థ­లు అప్ర­మ­త్త­మ­య్యా­యి. ము­ఖ్యం­గా మహి­ళ­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని ఉగ్ర­వాద కా­ర్య­క­లా­పా­ల­కు ఆక­ర్షిం­చే నె­ట్‌­వ­ర్క్‌­ను ఆమె నడి­పి­న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చ­డం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. వి­చా­ర­ణ­లో భా­గం­గా సైదా బేగం మహి­ళల రి­క్రూ­ట్‌­మెం­ట్ బా­ధ్య­త­లు తీ­సు­కు­న్న­ట్లు వె­ల్ల­డైం­ది. ఉగ్ర­వాద గ్రూ­పు­లు ఆమె­కు ప్ర­త్యే­కం­గా టా­ర్గె­ట్‌­లు ఇవ్వ­డం, ఆ మే­ర­కు యు­వ­తు­ల­ను తమ వైపు తి­ప్పే ప్ర­య­త్నా­లు చే­య­డం జరి­గి­న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఇప్ప­టి వరకు సు­మా­రు 42 మంది యు­వ­తు­ల­ను ఈ నె­ట్‌­వ­ర్క్‌­లో­కి రి­క్రూ­ట్ చే­సి­న­ట్లు గు­ర్తిం­చా­రు. రి­క్రూ­ట్ అయిన అమ్మా­యి­ల­కు స్నై­ప­ర్ రై­ఫి­ల్ వి­ని­యో­గం, షూ­టిం­గ్ వంటి అం­శా­ల్లో శి­క్షణ ఇవ్వా­ల­ని ఉగ్ర­వాద సం­స్థల నుం­చి ఆదే­శా­లు వచ్చి­న­ట్లు వి­చా­ర­ణ­లో తే­లిం­ది.

సైదా బేగం “ఖావాటీన్” పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ యువతులను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గ్రూప్ ద్వారా మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ, మరింత మందిని నెట్‌వర్క్‌లోకి చేర్చాలని సూచనలు అందుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించిన ఆమె, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 40 ఖాతాలను నిర్వహిస్తూ వివిధ వీడియోలు, సందేశాలు పంచినట్లు గుర్తించారు. వీటి ద్వారా యువతలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని నాటే ప్రయత్నం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మదర్సాల్లో మతపరమైన శిక్షణ పూర్తయ్యాక ఆయుధాల శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు విచారణలో బయటపడింది. సైదా బేగం నిర్వహించిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి పోలీసులు భారీగా డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్లాక్ పౌడర్ తయారీ, పేలుడు పదార్థాల రూపకల్పనకు సంబంధించిన వీడియోలు, పీడీఎఫ్ ఫైళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి శిక్షణ మరియు రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలకు ఉపయోగించినవిగా భావిస్తున్నారు.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు ఉగ్రవాద నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సైదా బేగం సంబంధాలు, ఆమెతో అనుబంధం ఉన్న ఇతర వ్యక్తులు, అలాగే ఈ నెట్‌వర్క్ వ్యాప్తి స్థాయిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలు భద్రతా పరంగా కీలకమైనవిగా మారడంతో సంబంధిత సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Tags

Next Story