జగన్ జోక్యం చేసుకుంటే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు : ఎంపీ రఘురామ

జగన్ జోక్యం చేసుకుంటే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు : ఎంపీ రఘురామ
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతోందని..? నిధుల విడుదల విషయంలో తప్పెవరిది అంటూ..

పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతోందని..? నిధుల విడుదల విషయంలో తప్పెవరిది అంటూ కోస్తా ఆంధ్రా ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన తరువాత జరిగిన మొదటి కేబినెట్‌ సమావేశంలోనే పోలవరం అథారిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితులలో ప్రాజెక్ట్ నిర్మాణపనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారన్నారు. పోలవరం నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలన్నారు. సీఎం స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు ఎంపీ రఘురామ.

Tags

Next Story