Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో  కొనసాగుతున్న భక్తుల రద్దీ
X
విధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులుతో నిండిపోయిన 6 కంపార్టుమెంట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు తిరుమల కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లలో 6 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా 15,680 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.17 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం

టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కుప్పాల గిరిధర్ కుమార్ టిటిడి శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిని కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చెక్ ను అందజేశారు. శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఎందరికో విశిష్ట సేవలందిస్తోందని గిరిధర్ పేర్కొన్నారు.

Tags

Next Story