బలవంతపు ఏకగ్రీవాలు సహించబోము : నిమ్మగడ్డ వార్నింగ్

Nimmagadda ramesh kumar
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలిరోజు మందకొడిగా దాఖలైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు... రెండో రోజు జోరందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 7వేల 460.. వార్డు స్థానాలకు 23వేల 318 నామినేషన్లు వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో సర్పంచి స్థానాలకు 1,156 నామినేషన్లు రాగా.. తూర్పుగోదావరి జిల్లాలో వార్డు సభ్యుల స్థానాలకు అత్యధికంగా 4వేల 678 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు సర్పంచి స్థానాలకు 8వేల 773, వార్డు సభ్యుల స్థానాలకు 25వేల 519 నామినేషన్లు వచ్చాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
ఇక తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కాక రేపుతోంది. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులకు పాల్పడడంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపతున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన టీడీపీ మద్దతుదారులను కిడ్నాప్ చేయడం, బెదిరించడం, అడ్డుకోవడంతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బలవంతపు ఏకగ్రీవాలను సహించబోమని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఈసీ ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com