Amaravati Theaters Seize: ఏపీలో థియేటర్లు సీజ్.. బాలయ్య అభిమానుల ఆందోళన

X
By - Prasanna |2 Dec 2021 4:13 PM IST
Amaravati Theaters Seize: మరికొన్ని ప్రాంతాల్లో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల సీజ్‌కు రంగం సిద్ధం
Amaravati Theaters Seize: ఏపీలో పలు చోట్ల అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే సినిమా ప్రదర్శించారని థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు.. కృష్ణా జిల్లా మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను సీజ్ చేశారు.. మరికొన్ని ప్రాంతాల్లో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల సీజ్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. మరోవైపు సీజ్ చేసిన థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులంతా ఆందోళన చేస్తున్నారు.. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఫైరవుతున్నారు.. ప్రభుత్వ చర్యల పట్ల సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com