Andhra Pradesh CMO: సీఎంవోలో దొంగలు పడ్డారు

Andhra Pradesh CMO: సీఎంవోలో దొంగలు పడ్డారు

‘సీఎంవోలో దొంగలు పడ్డ విషయాన్ని ఏపీ సీఐడీ నిర్ధారించింది. సీఎంవోలో డిజిటల్‌ సంతకాలు దుర్వినియోగం చేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్‌ తెలిపారు.సీఎం జగన్ డిజిటల్ సంతకాల్ని దుర్వినియోగం చేశారని సీఎంవోలో పని చేస్తున్న ఐదుగురు అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల స్థాయి ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లుగా సైబర్ క్రైమ్ సీఐడీ ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేస్తన్నట్లుగా తెలిపింది.స్కాం బయటపడి పది రోజుల తరువాత.చర్యలు తీసుకున్న సీఐడీ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.

ఇక సీఎంవో ఈ ఫైలింగ్ పాస్ వర్డులు ఎవరికీ తెలియవు .అత్యంత కాన్ఫిడెన్షియల్ . సంబంధిత అధికారుల వద్దనే ఉంటాయి.అయితే ఎలా తెలుసుకున్నారో కానీ అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తెలుసుకున్నారని.. వారు ఈ ఆఫీసులో లాగిన్ అయి.. సీఎం డిజిటల్ సిగ్నేచర్ ను వాడి ఫైళ్లను క్లియర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా క్లియర్ చేసినందుకు.. ఒక్కో ఫైల్‌కు ఒక్కో ఫైల్‌కు 30 వేల నుంచి 50 వేల వరకూ వసూలు చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు నిందితులు IAS ముత్యాల రాజు పేషీలో పనిచేసే ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కనమర్ల శ్రీను ను పేరును ఏ1గా, ధనుంజయరెడ్డి పేషీలో పనిచేసే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలానికి చెందిన గుత్తుల సీతారామయ్యను ఏ2గా, సీఎస్‌ జవహర్‌రెడ్డి పేషీలో పనిచేసే బాపట్ల జిల్లాకు చెందిన నలజల సాయిరామ్‌ ను A3గా, ముత్యాల రాజు పేషీలోనే పని చేసే మరో ఉద్యోగి సత్యసాయి జిల్లాకు చెందిన భూక్యా చైతన్యనాయక్‌ ను A4గా.సీఎస్‌ జవహర్‌ రెడ్డి పేషీలో పనిచేసే మరో ఉద్యోగి గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన అబ్దుల్‌ రజాక్‌ ను ఏ-5గా చేర్చి కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.

అయితే సీఎంవోలో ఉన్న ఫైళ్ల గురించి.. ఇతరులకు తెలియదు. అటెంజర్లకూ తెలియదు. ఎలా వసూలు చేస్తారన్న అంశంపై సీఐడీ వివరణ ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఓ ఐఏఎస్ అధికారి మామ నేతృత్వంలో సాగిన స్కాం అని.. సెక్రటేరియట్ లోనే చర్చించుకుంటున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దల హస్తం కూడా ఉన్నట్లు విమర్శలు వస్తున్న నేపధ్యంలో కింది స్థాయి అటెండర్లను.. డేటా ఎంట్రీ ఆపరేటర్లను బలి చేసి …అసలు నిందితుల్ని తప్పిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story