మనప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో దోపిడీ

మనప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో దోపిడీ
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మనప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకులతో..

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మనప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకులతో బెదిరించి... క్యాష్‌ కౌంటర్‌లోని 51 వేల రూపాయలు అపహించారు. మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు యువకులు... బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చామని సిబ్బందికి చెప్పి... లోపలికి ప్రవేశించారు. లోపలికి వచ్చిన దుండగులు... తుపాకులు చూపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ తలపై తుపాకి పెట్టి బెదిరించిన దుండగులు... కౌంటర్‌లోని నగదును అపహరించుకుని వెళ్లారు. మనప్పురం గోల్డ్‌ ఆఫీస్‌లోని... సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్న రాయదుర్గం పోలీసులు పరిశీలించారు. శనివారం ఇధ్దరు యువకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story