ఇక్కడ న్యాయం లేదు : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

X
స్టీల్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యాక్టరీ నెలకొల్పలేదని, అందుకే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామంలో ఫ్యాక్టరీ కోసం తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు.
పరిశ్రమ పెట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తారన్న ఆశతో రైతులు తమ భూములను వదులుకున్నారని ఆయన అన్నారు. అందుకే రైతుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని, ఎమ్మెల్యే తీరు మార్పుకోవాలని ఆయన అన్నారు. నాపై కర్ణాటక లోకాయుక్తలో కేసులు వేశారు. రాత్రికి రాత్రి వచ్చి నన్ను ఎత్తెకెళ్లి జైల్లో వేశారన్నారు. ఇక్కడ న్యాయం లేదని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
