Tirumala: తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు.. అన్నమయ్య నడిచిన మార్గంలో..

Annamayya margam (tv5news.in)
Tirumala: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా ఆ రాష్ట్రం మొత్తం చాలా కష్టాలనే ఎదుర్కుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఈ రోడ్డు మార్గాలకు నిర్మాణం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న మార్గాలు కాకుండా తిరుమలకు కొత్త రోడ్డు మార్గం ఏర్పాటు కానుందని సమాచారం.
ఇఫ్పటికే తిరుమలకు చేరుకోవడానికి రెండు ఘాటురోడ్లు ఉన్నాయి. ముందుగా తిరుపతి నుంచి తిరుమలకు 1944లో మొదటి ఘాట్‌రోడ్ నిర్మాణం జరిగింది. ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ నిర్మాణాన్ని దగ్గరుండి చేపట్టారు. 1970ల్లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు మూడో ఘాట్ నిర్మాణానికి రంగం సిద్ధమయ్యింది.
తిరుమలలో నిర్మాణం కానున్న మూడవ ఘాట్ రోడ్డు శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఈ మార్గం మీదుగానే తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి కాకుండా నేరుగా తిరుమలకు మాత్రమే చేరుకోగలిగే మార్గం ఇది. కడప జిల్లా భక్తులు చాలామంది ఈ మార్గాన్నే ఉపయోగిస్తుంటారు. దీనికి అన్నమయ్య మార్గం అనే పేరు కూడా ఉంది. అన్నమయ్య మార్గంలో నడిస్తే నేరుగా తిరుమలలోని తుంబురు కోనకు చేరుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com