ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీకి బెదిరింపు ఫోన్ కాల్స్

ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది.. CJIకి సీఎం జగన్ రాసిన లేఖను ఖండించినందున కాళ్లు విరగ్గొడతాం.. అంటూ బెదిరించారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీ అభిజాత్ తెలిపారు... లండన్ నుంచి ఫోన్ చేసి తనను, సహచర న్యాయవాదులను బెదిరించినట్టు ఫిర్యాదు చేశారు.. తనకు ప్రాణహాని ఉందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు అభిజాత్. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలియదంటూ బెదిరించారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
ఇదే తరహా బెదిరింపు ఫోన్‌కాల్స్ బార్ అసోసియేషన్ ట్రెజరర్ కు కూడా వచ్చినట్టుగా చెప్పారు..బెదిరింపు కాల్స్‌తో తాను, తన కుటుంబం కంపించి పోయామని.. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అభిజాత్.. ఇలాంటి బెదిరింపు కాల్స్ ద్వారా తన భావప్రకటన స్వేచ్ఛకి.... విధి నిర్వహణకు భంగం కలిగించినట్టేనన్నారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీ అభిజాత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com