కిటికీ పగలగొట్టుకుని విశాఖ మహిళా ప్రగతి కేంద్రం నుంచి మగ్గురు యువతులు పరారీ..!

కిటికీ పగలగొట్టుకుని విశాఖ మహిళా ప్రగతి కేంద్రం నుంచి మగ్గురు యువతులు పరారీ..!
X
విశాఖ మహిళా ప్రగతి కేంద్రం నుంచి మగ్గురు యువతులు పరారయ్యారు. ఉదయం 11 గంటలకు కిటికీ పగలగొట్టుకుని వెళ్లిపోయారు.

విశాఖ మహిళా ప్రగతి కేంద్రం నుంచి మగ్గురు యువతులు పరారయ్యారు. ఉదయం 11 గంటలకు కిటికీ పగలగొట్టుకుని వెళ్లిపోయారు. ప్రగతి కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వివిధ ఘటనల్లో బాధితులైన 12 మంది... స్వదార్‌ గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరారీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురూ కిటికీ పగలగొట్టుకుని వెళ్తుండగా... మిగిలిన వారంతా కేకలు వేశారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తమై... అడ్డుకునే లోపే... ఆ ముగ్గురూ ఆటో ఎక్కి పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story