మా ఇల్లు మా సొంతం అంటూ బాలకృష్ణ నినాదాలు

మా ఇల్లు మా సొంతం అంటూ బాలకృష్ణ నినాదాలు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ... టిడ్కోహౌస్‌ల వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ... టిడ్కోహౌస్‌ల వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. మా ఇల్లు మా సొంతం అంటూ నినాదాలు చేశారు. టిడ్కో గృహాలను పరిశీలించిన బాలకృష్ణ .. లబ్దిదారులతో మాట్లాడారు.

నిర్మాణాలు పూర్తైనా ఇళ్లు అప్పగించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని.. లబ్దిదారులు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా.. లబ్దిదారులకు కేటాయించడంలో విఫలమైందన్నారు బాలకృష్ణ.

దళితులపై దాడులు జరుగుతున్నా.. వారిని పరామర్శించడానికి ఓ ఎంపీగానీ.. ఎమ్మెల్యే కానీ వెళ్లడం లేదన్నారు. ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు కేటాయించకపోతే... గృహప్రవేశాలు చేసుకుంటాం.. ఏం చేసుకుంటారో చేసుకోండని బాలకృష్ణ హెచ్చరించారు.


Tags

Read MoreRead Less
Next Story