తిరుమలలో సీఎం డిక్లరేషన్ ఇవ్వలేదని హైకోర్టులో కో-వారెంట్ పిటిషన్
హిందు సంప్రదాయాలను అగౌరవపరుస్తూ తిరుపతిలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయ్యింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్లిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఇప్పటికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153 లకు విరుద్ధమని గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు.
సీఎం జగన్, మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్, ఈవో వారి పదవులు, పోస్టుల్లో ఏ అధికారంలో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన కో-వారెంట్పిటిషన్ వేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమంటూ పిటిషనర్ సూచించారు. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు మద్దతు పలికారని.. టీటీడీ ఛైర్మన్, ఈవోలు నిబంధనల అమల్లో విఫలమయ్యారని గుర్తుచేస్తూ పిటిషన్ వేశారు. హైకోర్టులో దాఖలైన ఈ కో-వారెంట్ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com