TTD: తిరుమలలో ఇక "స్వర్ణ" నిబంధనలు..!

TTD: తిరుమలలో ఇక స్వర్ణ నిబంధనలు..!
X
తిరుమల శ్రీవారి దర్శనంపై కఠిన నిబంధనలు

తి­రు­మల శ్రీ­వా­రి పవి­త్ర­త­ను కా­పా­డేం­దు­కు ఏపీ ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. దర్శ­నా­ని­కి సం­బం­ధిం­చిన ని­బం­ధ­న­ల­ను మరింత కఠి­న­త­రం చే­యా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ మే­ర­కు డి­క్ల­రే­ష­న్ ని­బం­ధ­న­ల­ను తప్ప­ని­స­రి­గా పా­టిం­చా­ల­ని టీ­టీ­డీ­కి ఆదే­శా­లు జారీ చే­సిం­ది. ఇక నుం­చి ఎవ­రై­నా అన్య­మ­త­స్తు­లు శ్రీ­వా­రి­ని దర్శిం­చు­కో­వా­లం­టే తప్ప­ని­స­రి­గా డి­క్ల­రే­ష­న్ ఇవ్వా­ల్సిం­దే­న­ని పే­ర్కొం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఈ ని­బం­ధన ఉన్నా అం­త­గా అమలు కా­వ­డం లేదు. స్వ­చ్చం­ధం­గా కొం­త­మం­ది డి­క్ల­రే­ష­న్ ఇచ్చేం­దు­కు ముం­దు­కొ­స్తు­న్నా­యి. కొం­త­మం­ది డి­క్ల­రే­ష­న్ ఇవ్వ­కుం­డా­నే దర్శిం­చు­కుం­టు­న్నా­రు. ఇక నుం­చి ఈ ని­బం­ధ­న­ల­ను ఖచ్చి­తం­గా అమలు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. తి­రు­మల ఆలయం పవి­త్ర­త­ను రక్షిం­చేం­దు­కు ఏపీ ప్ర­భు­త్వం ఆదే­శా­లు జారీ చే­సిం­ది. స్వ­ర్ణ దే­వా­ల­యం చట్టా­న్ని అధ్య­య­నం చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. స్వ­ర్ణ దే­వా­ల­యం తర­హా­లో­నే తి­రు­మ­ల­లో­నూ కొ­త్త చట్టా­న్ని తీ­సు­కు­రా­వా­ల­ని ప్ర­భు­త్వం యో­చి­స్తోం­ది. ఈ చట్టం అమలు చే­య­డం వల్ల తప్పు చే­సి­న­వా­రి­పై క్రి­మి­న­ల్ చర్య­లు తీ­సు­కు­నే అవ­కా­శ­ముం­టుం­ది.

పాముకాటు ప్రచారం.. అంతా అవాస్తవం

తి­రు­మల క్యూ­లై­న్‌­లో ఓ భక్తు­రా­లు పా­ము­కా­టు­కు గు­రై­న­ట్లు జరు­గు­తు­న్న ప్ర­చా­రా­న్ని టీ­టీ­డీ ఖం­డిం­చిం­ది. ఈ ప్ర­చా­రం­లో ఎలాం­టి వా­స్త­వం లే­ద­ని తే­ల్చి చె­ప్పిం­ది. ఈ మే­ర­కు వా­స్త­వం­గా అక్క­డేం జరి­గిం­దో వి­వ­రి­స్తూ ఏపీ ప్ర­భు­త్వ ఫ్యా­క్ట్‌­చె­క్‌ వి­భా­గం సైతం ‘ఎక్స్‌’లో పో­స్టు పె­ట్టిం­ది. ‘‘తి­రు­మల క్యూ­లై­న్‌­లో భక్తు­రా­లు పా­ము­కా­టు­కు గు­రై­న­ట్లు కొం­ద­రు చే­స్తు­న్న ప్ర­చా­రం­లో నిజం లేదు. వా­స్త­వా­ని­కి జరి­గిం­ది ఏమి­టం­టే.. వరం­గ­ల్‌­కు చెం­దిన శరత్ బాబు, మౌ­నిక దం­ప­తు­లు ఆది­వా­రం రా­త్రి స్వా­మి దర్శ­నం కోసం టా­క్సీ­లో ఎస్వీ మ్యూ­జి­యం వద్ద­కు వచ్చా­రు. ఆర్‌.బి.సెం­ట­ర్‌ పా­ర్కిం­గ్‌ ఏరి­యా వద్ద­కు రా­గా­నే తన కా­లి­కి పసు­పు రా­సు­కు­నే ఉద్దే­శం­తో మౌ­నిక కారు నుం­చి కిం­ద­కు ది­గా­రు. ఆ సమ­యం­లో తన కా­లి­కి ఏదో తా­క­డం­తో ఆమె భయం­తో గట్టి­గా అరి­చా­రు. వెం­ట­నే ఆమె భర్త శరత్ బాబు వె­తి­కి చూ­డ­గా అక్కడ ఒక పాము పి­ల్ల కని­పిం­చిం­ది. దీం­తో అప్ర­మ­త్త­మైన సె­క్యూ­రి­టీ సి­బ్బం­ది మౌ­ని­క­ను తి­రు­మ­ల­లో­ని అశ్వి­ని ఆస్ప­త్రి­కి తీ­సు­కు­వె­ళ్లా­రు. భక్తు­రా­లి­ని పరీ­క్షిం­చిన వై­ద్యు­లు ఆమె పా­ము­కా­టు­కు గు­రి­కా­లే­ద­ని ని­ర్ధా­రిం­చా­రు. అయి­న­ప్ప­టి­కీ ఆమె శ్రే­య­స్సు­ని దృ­ష్టి­లో ఉం­చు­కొ­ని ముం­దు జా­గ్ర­త్త­గా తి­రు­ప­తి­లో­ని స్వి­మ్స్‌­లో చే­ర్చా­రు. స్వి­మ్స్‌ వై­ద్యు­లు సైతం ఆమె పాము కా­టు­కు గు­రి­కా­లే­ద­ని చె­ప్పా­రు. అలా­గే, అక్కడ కని­పిం­చిన పాము కూడా వి­ష­పూ­రి­తం కా­ద­ని తే­లిం­ది. ఈ ఘటన జరి­గిన వెం­ట­నే తి­తి­దే సి­బ్బం­ది స్పం­దిం­చిన తీ­రు­కు ఆ దం­ప­తు­లు కృ­త­జ్ఞ­త­లు తె­లి­పా­రు. సో­మ­వా­రం ఉదయం ఆ దం­ప­తు­లు స్వా­మి­ని దర్శిం­చు­కు­న్నా­రు. జరి­గిం­ది ఇదీ. అం­దు­వ­ల్ల కొం­ద­రు చే­స్తు­న్న ఫేక్ ప్ర­చా­రా­ల­ను భక్తు­లు నమ్మొ­ద్దు’’ అని వి­జ్ఞ­ప్తి చే­సిం­ది.

Tags

Next Story