TTD: సామాన్యులకోసం శ్రీవారి వైకుంఠ దర్శనం.. ఆ 10 రోజులు ప్రత్యేకం..

TTD: సామాన్యులకోసం శ్రీవారి వైకుంఠ దర్శనం.. ఆ 10 రోజులు ప్రత్యేకం..
TTD: స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు.

TTD: ఏడుకొండలలో కొలువై ఉన్న ఆ వేంకటేశ్వరుడిని దర్శించాలని భక్తులు కాలినడకన తిరుపతి కొండకు చేరుకుంటారు.. స్వామివారికి మొక్కులు చెల్లించి, తలనీలాలు సమర్పించి తృప్తిగా తిరిగి వెళతారు.. దేవస్థాన అధికారులు సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22 వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.. చైర్మన్ కార్యాలయంలో కూడా ఈ పది రోజులు సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు.

జనవరి 11-14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్ బుకింగ్‌లో భక్తులకు కేటాయిస్తారు.

ఈ తేదీలలో ఎంబీసీ-34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ, ఏఆర్‌పీ కౌంటర్లలో గదులు కేటాయించబడవు.

జనవరి 11-14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ను రద్దు చేశారు.

సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాల్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ ద్వారా గదులు కేటాయిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story