బిగ్ బ్రేకింగ్.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

బిగ్ బ్రేకింగ్.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్, సాగర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

* తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

* ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్, సాగర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

* మార్చి 23న ఎన్నికల నోటిఫికేషన్

* నామినేషన్ దాఖలకు చివరి తేది మార్చి 30

* నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 3

* ఏప్రిల్ 17న పోలింగ్

* మే2 న ఫలితాలు వెల్లడించనున్న ఎన్నికల సంఘం


తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది.. ఏపీలో తిరుపతి పార్లమెంటు, తెలంగాణలో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.. ఈ రెండు స్థానాలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఈ రెండు స్థానాలకు ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈనెల 30 వరకు గడువు ఉండగా.. 31న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 17న ఈ రెండు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు మే 2న తిరుపతి పార్లమెంటు, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

Tags

Next Story