Tirupati Stampede: తిరుమల ఘటనపై నేతల దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి..

Tirupati Stampede: తిరుమల ఘటనపై నేతల దిగ్భ్రాంతి,  ప్రగాఢ సానుభూతి..
X
తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: ప్రధాని మోడీ

తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుఠం ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. 48 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసికూడా ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలా జరగడం బాధాకరం అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు.బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో బుధవారం నాడు అర్ధరాత్రి పోస్ట్‌ చేశారు.

రాహుల్ గాంధీ ..

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను రాహుల్ గాంధీ కోరారు..

ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (‘X’) వేదికగా స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట భక్తుల మృతికి కారణమవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సమీక్షిస్తామని తెలిపారు. Tirupati Stampede:

Tags

Next Story