ఆంధ్రప్రదేశ్

Tirupati: భార్య విశాల హృదయం.. భర్తకు ప్రియురాలితో పెళ్లి

Tirupati: ఇదేదో బావుంది.. ఇలా సర్థుకుపోతే బెటరేమో.. ఈ మధ్య వివాహేతర సంబంధాల్లో హత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

Tirupati: భార్య విశాల హృదయం.. భర్తకు ప్రియురాలితో పెళ్లి
X

Tirupati: ఇదేదో బావుంది.. ఇలా సర్థుకుపోతే బెటరేమో.. ఈ మధ్య వివాహేతర సంబంధాల్లో హత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.పెళ్లై పిల్లలున్నా ప్రేమా, దోమా అంటూ అతడు లేదా ఆమెతో వెళ్లి పోవడానికి ఏ మాత్రం సంకోచించట్లేదు. లేదంటే అడ్డుగా ఉన్నారని వాళ్లని చంపేస్తున్నారు. కానీ ఓ భార్య.. తన భర్త మరో స్త్రీతో ప్రేమ వ్యవహారం నడిపినా విశాల హృదయంతో అర్థం చేసుకుంది. తమ జీవితంలోకి మరో స్త్రీని ఆహ్వానించింది.

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక అంబేద్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చనువుగా ఉన్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె నుంచి దూరమయ్యాడు.

ఆ తరువాత టిక్‌టాక్‌లోనే పరిచయమైన కడపకు చెందిన మరో యువతితో ప్రేమాయణం సాగించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా విశాఖ యువతి నేరుగా ప్రేమించిన ప్రియుడిని వెతుక్కుంటూ తిరుపతి వచ్చింది. అతడికి పెళ్లైన విషయం తెలుసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా.. అతడి భార్యతో మాట్లాడి తానూ ఇక్కడే ఉంటానని చెప్పడంతో మొదట సంశయించింది.

కానీ చివరకు ఒప్పుకోక తప్పలేదు. చివరకు ముగ్గురూ కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. తన భర్తకు విశాఖ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడింది. తానే దగ్గరుండి భర్త ప్రేమించిన ప్రియురాలిని అలంకరించి అతడిచేత మూడు ముళ్లు వేయించింది. ఇప్పడు బాగానే ఉంటారు. కానీ ముందు ముందు ఎలా ఉంటారో అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

Next Story

RELATED STORIES