Andhra Praesh: విద్యార్థి సంఘం నేతల ముందస్తు అరెస్ట్‌లు

Andhra Pradesh: ఏపీలో జాబ్ కేలండర్‌కు వ్యతిరేకంగా..ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో విద్యార్ధి సంఘాల నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కొందరిని గృహ నిర్బంధం చేయగా.. మరికొందరిని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. నిరుద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితిల్లో... సీఎం ఇంటిని ముట్టడిస్తామంటున్నారు.
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ.. తెలుగు యువత, TNSF టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. దీంతో ఎక్కడిక్కడ విద్యార్థి సంఘాల నేతలను అదుపులో తీసుకున్నారు. అనంతపురంలో జేసీ పవన్ కుమార్‌రెడ్డిని గృహనిర్భందం చేశారు. పవన్‌కు మద్దతుగా శ్రేణులు ప్లకార్డుల ప్రదర్శించారు.
గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థి సంఘాల పిలుపుతో చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన వారిని దారిలోనే అరెస్ట్ చేశారు నరసరావుపేట పోలీసులు. నిర్భందాలతో ఉద్యమాలను అణిచివేయాలని చూడటం సరికాదంటున్నారు విద్యార్థి సంఘం నేతలు.
తిరుపతిలో జాబ్ క్యాలెండర్‌ని నిరసిస్తూ సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు- విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్ధి నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు చలో తాడేపల్లికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతుంటే.. విద్యార్థి సంఘాలు మాత్రం ఆందోళన చేపట్టి తీరుతామని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com