- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- Weather Report: తెలుగు రాష్ట్రాలను...
Weather Report: తెలుగు రాష్ట్రాలను వదలని వర్షాలు.. 24 గంటల్లో..

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆ తర్వాత క్రమంగా బలపడుతూ.. తదుపరి 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాగా ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇక... ఏపీలోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంగా కోస్తా, రాయలసీ ప్రాంతాల్లో, ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com