Vanama Raghavendra Rao: వనమా రాఘవేంద్రపై మొత్తం 12 కేసులు..

Vanama Raghavendra Rao: వనమా రాఘవపై రిపోర్ట్ సిద్ధం చేశారు పోలీసులు. బెదిరించి, వేధించి, ఆత్మహత్యలకు కారణమయ్యారన్న ఆరోపణలపై.. రాఘవపై వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. ఈ రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
పాల్వంచ టౌన్‌లో వనమా రాఘవపై ఐదు కేసులు ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, పాల్వంచ రూరల్‌లో రెండు కేసులు, లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఒక కేసు, కొత్తగా పాల్వంచ టౌన్‌లో మరో కేసు నమోదైనట్టు.. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రాశారు పోలీసులు.
రాఘవపై నమోదైన కేసులకు ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. అందుకే, బెయిల్ విషయంలో రాఘవ తొందరపాటుగా వ్యవహరించడం లేదనే మాట పోలీసువర్గాల్లో వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com