కదిరిలో విషాదం.. అప్పుల బాధతో భార్యా భర్తల ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. కదిరిలో అప్పుల బాధతో భార్యా భర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. కదిరి రాధిక థియేటర్ సమీపంలో బట్టల దుకాణం నడుపుతున్న ప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా వ్యాపారం లేక తీవ్రంగా నష్టపోయారు.. వ్యాపారం నడకవ, తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులవాళ్ల ఒత్తిడి తాళలేక, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు.. నాలుగు రోజుల క్రితం తిరుపతికి వెళ్తున్నామని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరిన ప్రసాద్, లత.. బట్టల దుకాణానికి వెళ్లి తాళం వేసుకున్నారు.. మూడురోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో స్థానికుల నుంచి మరో కంప్లయింట్ వచ్చింది.. ఉదయం బట్టల దుకాణంలోంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. తలుపులు పగలగొట్టి చూడగా ప్రసాద్ దంపతులు విగతజీవులై కనిపించారు.. ప్రసాద్, లత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలూ అనాధలయ్యారు.. అటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com