సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్ తెలుగు కష్టాల వీడియో

ఏడు నిమిషాలు.. తొమ్మిది తడబాట్లు.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. కొన్ని పదాలను పలకలేక ముఖ్యమంత్రి జగన్ పడ్డ కష్టాలను సోషల్ మీడియాలో కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.. స్పీచ్ మొదట్లో వేదికమీదున్న వారిని పరిచయం చేసే సందర్భంలో సీఎం తడబడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ అని అనబోయి.. సవాంగం అన్నారు. స్పీచ్ ముగిసే వరకు చాలాసార్లు తడబడ్డారు. జగన్ తడబాట్లను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగుని ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడుకున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. రాసిచ్చిన స్పీచ్ కూడా చదవలేకపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com