APERC: ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన కరెంట్‌ ఛార్జీలను వెనక్కి ఇచ్చేయాలి: ఏపీ ఈఆర్సీ

APERC: ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన కరెంట్‌ ఛార్జీలను వెనక్కి ఇచ్చేయాలి: ఏపీ ఈఆర్సీ
APERC: న్యాయపరమైన చిక్కులు వస్తుండడంతో ట్రూఅప్ ఛార్జీలను తిరిగి చెల్లించాలన్న ఈఆర్సీ

APERC: ట్రూఅప్ పేరుతో అధిక మొత్తంలో వసూలు చేసిన కరెంట్‌ ఛార్జీలను వెనక్కి ఇచ్చేయాలని ఏపీ ఈఆర్సీ ఆదేశించింది. ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్ధలకు వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రూఅప్ ఛార్జీల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది.

సర్దుబాటు పేరుతో ఏపీ ప్రజలపై జగన్‌ సర్కారు అధిక భారం మోపింది. దీంతో పేదవాళ్లకి సైతం వందలు, వేలల్లో కరెంట్ బిల్లులు వచ్చాయి. ట్రూఅప్ ఛార్జీలను హైకోర్టు సైతం తప్పుపట్టింది. న్యాయపరమైన చిక్కులు వస్తుండడంతో వసూలు చేసిన ట్రూఅప్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఈఆర్సీ ఆదేశించింది.

గత సెప్టెంబర్, అక్టోబర్‌లో సదరన్, ఈస్ట్రన్ కంపెనీలు సర్దుబాటు పేరుతో ట్రూ అప్ ఛార్జీలు విధించాయి. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న కరెంట్ బిల్లుల్లో వాటిని సర్దుబాటు చేయాలని ఈఆర్సీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story