TS: తండ్రీ, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారు

కొండగట్టు ఆలయానికి వెంటనే ఐదు వందల కోట్లు విడుదల చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోనే ప్రశస్థమైన దేవాలయం కొండగట్టు అని, అంజన్న ఆశీర్వాదం తీసుకొని 4 కోట్ల ప్రజలకు మేలు జరిగేలా కోరుకున్నానన్నారు. గుడిలో ఉన్న పూజారులు భక్తులను, కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రీ, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు. కొండగట్టు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం తమకు లేదన్న ఆయన... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com