కీలక నిర్ణయాలు తీసుకున్నటీటీడీ పాలకమండలి

శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ ఐదు నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదిక ప్రకారం ద్వారాలను తెరుస్తున్నామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. . తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ బస్సుల స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామన్నారు.
అలాగే టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా టీటీడీకి 1,128 ఆస్తులు ఉన్నాయన్నారు. ఇందులో టీటీడీకి 8,088 ఎకరాల స్థలాలు ఉన్నాయ ని వైవీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కమిటీ నియమించామన్నారు. ఇక నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు చేపడతామన్నారు. పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ చేస్తామని వైవీ వెల్లడించారు.