తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : ఎంపీ రఘురామకృష్ణంరాజు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న డిక్లరేషన్‌ను మార్చడం వివాదాస్పదమవుతోంది.. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ ఛైర్మన్ వివరణ ఇచ్చినప్పటికీ దుమారం ఆగడం లేదు. దీనికి కొనసాగింపుగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. ఏ గుడికి, మసీదుకు, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇదంతా రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనంటూ చెప్పుకొచ్చారు.. అయితే, టీటీడీలో వీఐపీలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందనే విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.. గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటున్నాయి.. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చసే అధికారం టీటీడీ ఛైర్మన్‌కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాయి. తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని.. ఒక్కరి కోసం టీటీడీ పద్ధతులు మార్చడం సరికాదన్నారు ఎంపీ రాఘరామకృష్ణ రాజు. ఏపీలో ఆలయాలు, హిందూమతంపై దాడులకు నిరసనగా నల్ల రిబ్బన్ ధరించి పార్లమెంట్‌కు హాజరవుతానని తెలిపారు.
ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుపై కేంద్ర జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. దేవాలయాలపై వరుస దాడులపై రాజ్యసభలో చర్చలేవ నెత్తిన ఎంపి.. ఆంధ్రప్రదేశ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ఇవ్వాల్సిన డిక్లరేషన్ నిబంధనను రద్దు చేయడంపై ఆయన సభలో ప్రస్తావించారు. దీనివల్ల ఆలయ పవిత్రతకు భంగం కల్గుందన్నారు. ఈ విషయాలపై కేంద్ర జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని సభలో కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. మొత్తంగా డిక్లరేషన్ ఎత్తివేయడమంటే శ్రీవారిని అవమానించడమేనని విపక్షాలంటున్నాయి.. ముఖ్యమంత్రి కోసం నిబంధనలు మార్చేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.. మరోవైపు టీటీడీ డిక్లరేషన్ అంశాన్ని నిరసిస్తూ అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారాలతో టీటీపీ నేతలు నిరసన తెలిపారు.. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com