TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నడకమార్గంలో పూర్తిస్థాయిలో కప్పు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 2.20 కోట్లతో విద్యుత్ బస్సులకు ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాల నివారణకు రక్షణగోడల నిర్మాణ చేపట్టాలని.. అందు కోసం 24 కోట్ల రూపాయలు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో భక్తులు వేచి ఉండేందుకు క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక పద్మావతి ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు 76 కోట్లు మంజూరు చేశారు. శ్రీనివాసమంగాపురంలో 3.10 కోట్ల రూపాయలతో పార్కింగ్, కళ్యాణకట్ట నిర్మాణం చేపట్టనున్నారు. ఇక శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ వాటాకు సంబంధించి 118 కోట్లు విడుదల చేశారు. అటు అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని సంప్రదాయ పద్దతిలో తయారు చేసే యూనిట్ ఏర్పాటుకు 4 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిరాస్తుల భద్రతకు 1.20 కోట్ల రూపాయలు విడుదలు చేసింది టీటీడీ పాలకమండలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com