TTD: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు ఇవే

TTD:  తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు ఇవే
X

తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం వారికి స్వామి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య జారీ చేయనున్నారు.

మార్గ దర్శకాలు ఇవే..

ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు కేటాయిస్తారు

దర్శనం టికెట్‌ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తప్పనిసరిగా చూపించాలి

టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తీసుకురావాల్సి ఉంటుంది

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్‌ హాల్‌ (దివ్యదర్శనం)క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు

ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు

స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.

Tags

Next Story