TTD: ఇంధన నిల్వలను పటిష్టం చేసిన టీటీడీ

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో నిరంతరాయంగా అన్నప్రసాదం, లడ్డూల తయారీ కోసం LPG నిల్వలను పెంచుకుంది. ప్రస్తుతం తిరుమలలో 10 టన్నుల సామర్థ్యం ఉన్న 3 బుల్లెట్ ట్యాంకులు, 7 టన్నుల సామర్థ్యం ఉన్న మరో 2 ట్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 6 టన్నుల గ్యాస్ వినియోగిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారత్ తో సహా పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తయింది. కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్న టీటీడీ అవసరాలకు ఇబ్బంది రాకుండా ముందస్తుచర్యలు తీసుకుంది. గ్యాస్ కొరత రాకుండా టీటీడీ అప్రమత్తమైంది. గ్యాస్ సరఫరా ఆపోద్దంటూ ఐఓసీఎల్‌కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ విజ్ఞప్తిపై ఐఓసీఎల్ సానుకూలంగా స్పందించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం
వంట గ్యాస్ కొరత లేదు: టీటీడీ
అన్నదానం వంటశాలలకు వంట గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిందనే వార్తలపై టీటీడీ స్పందించింది. టిటిడి తన లడ్డూ, అన్నదానం వంటశాలలకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని తెలిపింది. తిరుమలలో ప్రతిరోజూ సగటున నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారు. అయితే పండుగ సమయాల్లో ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు పెరుగుతుంది. తిరుమలలో లడ్డూ తయారీ, అన్నదానం యూనిట్లకు కలిపి మొత్తం వంట గ్యాస్ అవసరం రోజుకు 10 టన్నులకు పైగా ఉందని అధికారి తెలిపారు. తిరుమలలో వంట గ్యాస్ సరఫరాలో కొరత లేదా అంతరాయం లేదు. భక్తులు ఎటువంటి పరిమితులు లేకుండా యధావిధిగా లడ్డూలను తీసుకోవచ్చునని అధికారి తెలిపారు. లడ్డూలు, స్వీట్లు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా తయారు చేయడానికి ఆలయ సంస్థ ఒక వారానికి సరిపడా వంట గ్యాస్ బఫర్ స్టాక్‌ను కలిగి ఉందని అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
