TTD Tickets: తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఆ వెబ్‌సైట్‌లో మాత్రమే..

TTD Tickets: తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఆ వెబ్‌సైట్‌లో మాత్రమే..
TTD Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

TTD Tickets: తిరుమల దర్శనం టికెట్లకు ఉండే డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అందుకే ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఇలా విడుదల చేయగానే.. అలా అవన్నీ బుక్ అయిపోతున్నాయి. ఇక వచ్చే నెల అంటే ఫిబ్రవరీకి సంబంధించిన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేసింది. శ్రీవారి రూ.300 దర్శనం ఫిబ్రవరి నెల కోటాను నేడు విడుదల చేసింది టీటీడీ.

శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు స్లాటర్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story