Tirumala: టీటీడీ అత్యవసర సమావేశం; చిరుతల దాడులతో అప్రమత్తమైన యంత్రాంగం

Tirumala: టీటీడీ అత్యవసర సమావేశం; చిరుతల దాడులతో అప్రమత్తమైన యంత్రాంగం
X

తిరుమలలో చిరుత దాడుల నేపధ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. మధ్యాహ్నం 3గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. వన్య మృగాల నుంచి భక్తులను సంరక్షించేందుకు శాశ్వత చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నడకదారుల్లో మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి రద్దు చేశారు. సాయంత్రం 6గంటల తర్వాత ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాలను కూడా టీటీడీ అనుమతించడం లేదు. తాజా సోమవారం ఉదయం శ్రీవారి మెట్ల నడక మార్గంలోని 2వేల మెట్టు వద్ద ఎలుగుబంటి సంచారించింది. వన్య మృగాల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన ఆడ చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున ఆడ చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు చిరుతను తిరుపతి జూకు తరలించారు.

Tags

Next Story