TTD: రేపు వృద్ధులకు ప్రత్యేక దర్శనం టోకెన్‌‌లు విడుదల చేస్తున్న టీటీడీ

TTD: రేపు వృద్ధులకు ప్రత్యేక దర్శనం టోకెన్‌‌లు విడుదల చేస్తున్న టీటీడీ
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) జూన్ 2023 నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్‌లతో సహా ఆర్జిత సేవా టిక్కెట్‌లను గురువారం విడుదల చేసింది.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) జూన్ 2023 నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్‌లతో సహా ఆర్జిత సేవా టిక్కెట్‌లను గురువారం విడుదల చేసింది. అదేవిధంగా, జూన్ నెల మిగిలిన ఆర్జితసేవా టిక్కెట్‌ల కోసం ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. లక్కీడిప్‌లో టిక్కెట్లు పొందిన వారు కన్ఫర్మ్ చేసుకోవాలి. కాగా, జూన్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు యాప్ ద్వారా భక్తులు టిక్కెట్లు పొందవచ్చని టీటీడీ వెల్లడించింది. మరోవైపు వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తిరుమల దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టోకెన్లను మార్చి 24న అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, వాపసు చెల్లింపు తదితర అంశాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెడుతూ తిరుమలలో అక్రమాలను నిరోధించేందుకు టీటీడీ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తికి ఎక్కువ లడ్డూ టోకెన్లు రాకుండా గదుల కేటాయింపు కేంద్రాల సమీపంలోని కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story