కేంద్రాన్ని ఒప్పించడం చేతకాకపోతే.. జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి : తులసిరెడ్డి

X
పోలవరం విషయంలో సీఎం జగన్ మాట తప్పి.. మడమ తిప్పారని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. పోలవరం డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం అంటే ప్రాజెక్ట్ స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు. కేంద్రాన్ని ఒప్పించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. అసమర్ధులను అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు తులసిరెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
