Tungabhadra Dam: 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్త గేటు

Tungabhadra Dam: 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్త గేటు
X
కొనసాగుతున్న మరమ్మతు పనులు... పరిశలించిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

వరద ఉద్ధృతికి పుల్లింగ్ చైన్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ నంబరు గేటుకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. ఐరన్‌ షీట్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాక కొత్తగేటు ఏర్పాటు చేసే అవకాశముంది.

శనివారం రాత్రి నుంచి సుమారు 75వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతోంది. ఇదే విధంగా వెళితే రోజుకు 9 టీఎంసీల నీరు వృథా అవుతుంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. మరో వైపు నిపుణుల బృందం డ్యామ్‌ వద్దకు చేరుకుంది. ఐరన్‌ షీట్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్తగేటు ఏర్పాటు చేయడానికి వీలుపడుతుందని భావిస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35శాతం ఉండగా.. డ్యామ్‌ నిర్వహణకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది.

ఏమైందంటే....

కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ప్రమాదం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం ఏర్పడనుంది.

పరిశీలించిన డీకే

తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని తుంగభద్ర బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఘటన జరిగిందా? లేక మానవ తప్పిదమా?అని కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పల, గదగ్ జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర జలాశయం వర ప్రదాయనిగా ఉందన్నారు.

Tags

Next Story