నారా లోకేశ్ , గుంటూరు అర్బన్‌ ఎస్పీల మధ్య ట్విట్టర్‌ వార్

నారా లోకేశ్ , గుంటూరు అర్బన్‌ ఎస్పీల మధ్య ట్విట్టర్‌ వార్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, గుంటూరు అర్బన్‌ ఎస్పీల మధ్య ట్విట్టర్‌ వార్‌ జరుగుతోంది. పొన్నూరు ఎమ్మెల్యేను ఉద్దేశించి టీడీపీ కార్యకర్త మణిరత్నం పెట్టిన పోస్టుకు అతన్ని అక్రమంగా అరెస్టు చేశారంటూ లోకేస్‌ ట్వీట్‌ చేశారు. సగం గోడ కట్టి... ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేయడం... జగన్‌ పిరికి తనాన్ని బయటపెట్టిందంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు. మణిరత్నం పెట్టిన పోస్టులో తప్పేంటో పోలీసులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొందమంది పోలీసులు.... ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదని... కష్టాలు కొనితెచ్చుకుంటారని హెచ్చరించారు లోకేష్‌...

అయితే లోకేష్‌ పెట్టిన ట్వీట్‌కు స్పందించారు గుంటూరు అర్బన్ ఎస్పీ. అసత్యాలు ప్రచారం చేస్తే లోకేష్‌పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. కలహాలు ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. దీంతో.... ఎస్పీ ట్వీట్‌పై స్పందిస్తూ మరోట్వీట్‌ పోస్టు చేశారు నారా లోకేష్‌. గుంటూరు అర్బన్‌ ఎస్పీకి దమ్ము, ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను బయట పెట్టాలని సవాల్‌ విసిరారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం... పోలీసు స్టేషన్‌ నుంచి విడుదలైన ఫొటోను ట్యాగ్‌ చేశారు. రాజకీయ ఉన్నతాధికారులకు పోలీసులు లొంగిపోవడం మానుకోవాలంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story