మల్లెమడుగు వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతుల్లో ఇద్దరు సురక్షితం

X
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం జింకలమిట్ట దగ్గర మల్లెమడుగు వాగులో చిక్కుకున్న ముగ్గురిలో ఇద్దరిని రెస్క్యూటీం కాపాడింది. రైతులు లోకేష్, వెంకటేష్‌లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే మరో రైతు ప్రసాద్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. గల్లంతైన ప్రసాద్ కోసం ఎన్టీఆర్‌ఎఫ్ టీం... మల్లెమడుగు వాగులో ముమ్మరంగా గాలిస్తుంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లే రైతులు వాగులో చిక్కుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇటు చంద్రగిరి మండలం మొండికాలువ గ్రామంలో దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద దాటికి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. అతడిని గమనించిన స్థానికులు... సురక్షితంగా కాపాడారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
