ఓటర్లకు మద్యం పంచుతున్న ఇద్దరు అరెస్ట్!

ఓటర్లకు మద్యం పంచుతున్న ఇద్దరు అరెస్ట్!
నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌ ఆముదాలదిన్నె గ్రామంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌ ఆముదాలదిన్నె గ్రామంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రైస్ మిల్ వెనుక 41 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మోర్ల రాజేంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా.. ఆముదాలదిన్నె పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారని.. మరో నిందితుడు తాతా రాజేంద్ర, మోర్ల రాజేంద్రకు సహాయకుడిగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story