సత్తెనపల్లిలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. అర్ధరాత్రి మహిళను అడ్డుకుని

సత్తెనపల్లిలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. అర్ధరాత్రి మహిళను అడ్డుకుని
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలో మహిళను అడ్డుకుని అఘాయిత్యానికి యత్నించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలో మహిళను అడ్డుకుని అఘాయిత్యానికి యత్నించారు. మద్యం మత్తులో ఆటోలో వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కాలంటూ బలవంతపెట్టారు. చేయి పట్టుకుని ఆటోలోకి లాగేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు ఉన్న భర్త కల్యాణ్‌ రాజ్‌ దుండగులతో ప్రతిఘటించారు. కల్యాణ్‌రాజ్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. మహిళ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు.

సత్తెనపల్లి వావిలాల కాలనీకి చెందిన దంపతులు బైక్‌పై వెళ్తుండగా బైక్‌ రిపేర్‌ రావడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన ఇద్దరు అగంతకులు... మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆటోలోకి లాక్కునేందుకు యత్నించారు. ఈ సమయంలో కల్యాణ్‌ రాజ్‌ అడ్డుకున్నారు. అతడిపైనా అగంతకులు దాడికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అటు సత్తెనపల్లి-హైదరాబాద్‌ హైవేపై అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆకతాయిల ఆగడాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. చదువుల కోసం వెళ్లే విద్యార్థులు నిత్యం రాత్రి పూట ప్రయాణాలు చేస్తుంటారని చెబుతున్నారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహించాలని, ఘోరాలు జరగకముందే పోలీసులు పట్టించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story