Vizianagaram: ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్‌ కలకలం

Vizianagaram: ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్‌ కలకలం
విజయనగరం జిల్లా వీ.టి అగ్రహారం స్వధార్‌ హోమ్‌లో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్‌ కలకలం రేపుతుంది. జిల్లా స్త్రీ శిశు సంక్ష

విజయనగరం జిల్లా వీ.టి అగ్రహారం స్వధార్‌ హోమ్‌లో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్‌ కలకలం రేపుతుంది. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలికలు మిస్ అయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో బాలికలు స్వధార్‌ హోమ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక బాలికల మిస్సింగ్‌పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్వధార్ హోమ్ నిర్వాహణ కొనసాగుతుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పర్యవేక్షణ లోపం, సరైన భద్రత లేకపోవడమే బాలికల మిస్సింగ్‌కు కారణమని పోలీసులు చెబుతున్నారు. స్వధార్ హోమ్‌లో ఉన్న రూమ్ కిటికీ ఊచలు తొలగించినట్లు గుర్తించారు. మిస్సైన ఇద్దరు బాలికలు విజయనగరం, విశాఖకు చెందిన వారిగా నిర్వాహకులు చెబుతున్నారు. బాలికల మిస్సింగ్‌పై రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సరైన సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేకపోవడంపై పెద్ద ఎత్తన విమర్శలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర బాలల హక్కుల ఛైర్మన్ అప్పారావు స్వధార్‌ హోమ్‌ను పరిశీలించారు.

Tags

Next Story