Kadambari Jethwani: నటి వేధింపుల కేసులో ఇద్దరు పోలీసులపై వేటు

ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసులో నిబంధనలు ఉల్లంఘించన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఆమెను వేధించిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణపై కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే కేసు నమోదు చేసి ఆఘమేఘాలపై అరెస్టు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆఘమేఘాలపై అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముంది.
ఆ ముగ్గురు ఐపీఎస్‌లపైనా వేటు..?
ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడడంతో మిగిలిన అధికారులు భయంతో వణికిపోతున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై కూడా చర్యలకు రంగం సిద్ధమైంది. నేడో, రేపో వీరి ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నటి వేధింపుల్లో వీరు కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు ఫిర్యాదు
దేశంలోని సంచలనం కలిగిన ముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చేరింది. శుక్రవారం ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు విచ్చేశారు. వైసీపీ వాళ్ళు తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్లు ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా అందించినట్లుగా సమాచారం. సినీ నటి కేసు వ్యవహారం పోలీసుల కేసును వేగవంతం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com