Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయం..!

విజయవాడ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయమైంది. కారు డోర్ తగలడంతో తలకు కిషన్‌రెడ్డి గాయపడ్డారు. వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జన ఆశీర్వాద సభ ముగించుకుని దుర్గ గుడికి వెళ్లడం కోసం కారు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ డోర్ తగడలడంతో... కిషన్‌రెడ్డి గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పర్యటన కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. కిషన్‌రెడ్డికి ఏపీ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత అమ్మవారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలు సోము వీర్రాజు, సీఎం రమేష్, మాధవ్ దుర్గమ్మను దర్శించుకున్నారు.
వరంగల్ రామప్ప ఆలయాన్ని యునెస్కో హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీలో 126 ప్రముఖ స్థలాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని వివరించారు. జనవరి 1 నుంచి పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ, తెలంగాణ రెండు కళ్ల వంటివని చెప్పారు. దుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com