ఏపీ హైకోర్టు తరలింపుపై వివరణ ఇచ్చిన కేంద్రం

ఏపీ హైకోర్టు తరలింపుపై వివరణ ఇచ్చిన కేంద్రం
X
ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని, దానికి ఎలాంటి గడువూ లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని, దానికి ఎలాంటి గడువూ లేదని కేంద్రం స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలిస్తున్నారా.. అంటూ ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదన చేశారని... హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. అలాగే హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని, పరిపాలన బాధ్యతలు మాత్రం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Tags

Next Story