ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో

X
ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,405 సాంపిల్స్ ని పరీక్షించగా.. 1,732 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కృష్ణలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఒక్కరు, గుంటూరు లో ఒక్కరు , నెల్లూరు లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 1,761 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 8,45,082 పాజిటివ్ కేసు లకు గాను.. 8,17,339 మంది డిశ్చార్జ్ కాగా.. 6,828 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,915 గా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
