UTTHAM: మంత్రి ఉత్తమ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

UTTHAM: మంత్రి ఉత్తమ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
X

తె­లం­గాణ రా­ష్ట్ర నీ­టి­పా­రు­దల శాఖ మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి­పై నాన్ బె­యి­ల­బు­ల్ వా­రెం­ట్ జారీ అయ్యిం­ది. ఎన్ని­కల ని­య­మా­వ­ళి ఉల్లం­ఘ­న­కు సం­బం­ధిం­చిన కే­సు­లో నాం­ప­ల్లి ప్ర­జా­ప్ర­తి­ని­ధుల కో­ర్టు షాక్ ఇచ్చిం­ది. వి­చా­ర­ణ­కు మం­త్రి హా­జ­రు­కా­క­పో­వ­డం­తో న్యా­య­స్థా­నం ఆయ­న­పై నాన్ బె­యి­ల­బు­ల్ వా­రెం­ట్ జారీ చే­సిం­ది. గత అసెం­బ్లీ ఎన్ని­కల ప్ర­చార సమ­యం­లో ఎన్ని­కల కోడ్ అమ­ల్లో ఉం­డ­గా ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి సభ ని­ర్వ­హిం­చి, ట్రా­ఫి­క్‌­కు అం­త­రా­యం కలి­గిం­చా­ర­ని పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు­లు అం­దా­యి. దీం­తో మం­త్రి­పై అప్ప­ట్లో పో­లీ­సు­లు పలు సె­క్ష­న్ల కింద కేసు నమో­దు చే­య­గా... ఈ కే­సు­కు సం­బం­ధిం­చి నాం­ప­ల్లి­లో­ని ప్ర­జా­ప్ర­తి­ని­ధుల కో­ర్టు­లో వి­చా­రణ జరు­గు­తోం­ది. ఈ క్ర­మం­లో మం­త్రి ఉత్త­మ్ వి­చా­ర­ణ­కు హా­జ­రు కా­క­పో­వ­టం­తో ఆయన వై­ఖ­రి­పై కో­ర్టు అసం­తృ­ప్తి వ్య­క్తం చే­స్తూ నాన్ బె­యి­ల­బు­ల్ వా­రెం­ట్ జారీ చే­సిం­ది. అనం­త­రం కేసు తదు­ప­రి వి­చా­ర­ణ­ను ఈ నెల 16వ తే­దీ­కి వా­యి­దా వేసి.. ఆ రోజు మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి వ్య­క్తి­గ­తం­గా వి­చా­ర­ణ­కు తప్ప­ని­స­రి­గా హా­జ­రు­కా­వా­ల­ని ఆదే­శిం­చిం­ది.

Tags

Next Story