vangaveeti : ఇంట్రెస్టింగ్.. ఒకేచోట వంగవీటి రాధ, వల్లభనేని వంశీ..!

వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా.. వంగవీటి రాధ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకే దగ్గర కలుసుకున్నారు. వంగవీటి రాధ.. రంగ విగ్రహానికి పూల మాల వేసే సమయంలో వల్లభనేని వంశీ కూడా అక్కడే ఉన్నారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గరున్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. తరువాత వల్లభనేని వంశీ కూడా రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాధ. 33 సంవత్సరాలుగా వంగవీటి రంగ వర్ధంతిని అభిమానులే దగ్గరుండి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.
కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగ పేరు పెట్టించేలా వల్లభనేని వంశీనే ప్రయత్నం చేయాలన్నారు జనసేన నేత పోతిన మహేష్. వంగవీటి రంగా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి వంగవీటి రంగా అండగా నిలిచారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com