మండిపోతున్న ఎండలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మండిపోతున్న ఎండలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
సాధారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో నమోదయ్యే ఉష్ణోగ్రతలు.. నెల ప్రారంభంలోనే నమోదు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఓవైపు ఎండలు.. మరోవైపు వడ గాలులు.. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సాధారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో నమోదయ్యే ఉష్ణోగ్రతలు... నెల ప్రారంభంలోనే నమోదు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా కురిచేడులో 45.82 డిగ్రీలు, కందుకూరులో 45.76 డిగ్రీలు నమోదయ్యాయి. మార్టూరులో 45.86 డిగ్రీలు, కనిగిరిలో 44.98 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండలకు తోడు వేడి గాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ మొదట్లోనే సూర్యుడి ప్రతాపంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహం రహదారులు బోసిపోతున్నాయి.

Tags

Next Story