తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంలా మారాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంలా మారాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందుకు సాగుదామని ఆయన తెలిపారు. మన భాష, సంస్కృతులను ప్రోత్సహించడంతో పాటు.. ఇతర భాషలను గౌరవించాలన్నారు. ఇక తెలుగు సమాజ నిర్మాణం కోసం రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Tags

Next Story