NTR: ఎన్టీఆర్.. కారణజన్ముడు

ఎన్టీఆర్ కారణజన్ముడని, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటివి ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలని వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో వెంకయ్య పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ‘తారకరామం-అన్నగారి అంతరంగం’శీర్షికతో ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్’కమిటీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా ఓ సందేశాత్మకమని లోతుగా చూసిన వాళ్లకే అర్థమవుతుందన్నారు. నేటి తరం తెలుసుకోవాల్సిన అంశాలు ‘ఎన్టీఆర్ అంతరంగం’ పుస్తకంలో ఉన్నాయన్నారు. ఎన్నో సందేశాలను సినిమా ద్వారా వివరించిందని ఎన్టీఆర్ మాత్రమేనని కొనియాడారు. స్వర విన్యాసం, నట విశ్వరూపంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటారని వెంకయ్యనాయుడు కొనియాడారు.
తారకరామం.. సార్థకనామం
గొప్పవాళ్ల చరిత్రను నిక్షిప్తం చేసుకుని నవతరానికి తెలియజేసినప్పుడు ఆ పరంపర కొనసాగుతుందని వెంకయ్యనాయుు అన్నారు. తారకరామం, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాలను చాలా బాగా రూపొందించారని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు. ఎన్టీఆర్‌లో క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తనకు బాగా నచ్చాయన్నారు. ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు జీవితంలో ఎవరైనా పైకి వస్తారని... ఈ మూడు లక్షణాలు ఉంటే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని వెంకయ్య తెలిపారు. చిత్రాల్లోని డైలాగులు, పాటల్లో ఒక సందేశం ఉంటుందన్నారు. దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని... నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారని ఎన్టీఆర్ తెలిపారు.
దైవాంశ సంభూతుడిగా...
పాతళభైరవి సినిమాతో ఎన్టీఆర్‌కు స్టార్ స్టేటస్ సంపాదించి పెట్టిన దర్శకుడు కె.వి.రెడ్డి ‘మాయాబజార్’ సినిమాతో ఆయనను దైవాంశ సంభూతుడిగా నిలబెట్టారని వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. ఆ పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు. ఎన్టీఆర్‌లో దైవాన్ని చూడడం మొదలుపెట్టారని అన్నారు. తిరుపతి వెళ్లి వేంకటేశ్వరసామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా మద్రాసు వెళ్లి ఎన్టీ రామారావు దర్శనం కోసం ఆయన నివాసం ముందు గంటల తరబడి నిరీక్షించేవారని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com