Vijay Sai Reddy: విజయసాయి రెడ్డి భూదాహంపై టీవీ5 కథనాలతో ప్రకంపనలు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూదాహంపై టీవీ5 ప్రసారం చేసిన వరుస కధనాలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ సర్కార్ భూ పందేరాలపై మండిపడుతున్న స్థానికులు. ఎలాగైనా ప్రభుత్వ చర్యలను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అందిన కాడికి అధికార పార్టీ నేతలు భూములు స్వాహా చేస్తున్నారని విపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తర్లువాడ కొండపై విష్ణుపాదాలు,దేవాలయంను కాపాడుకుంటామంటున్నారు స్థానికులు.
విశాఖలో మరో 300 కోట్ల రూపాయల భూ కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రిషికొండకు బోడిగుండు కొట్టించి, ఖరీదైన భూములు ఇష్టానుసారంకబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వివాదాల్లో జోక్యం చేసుకొని దసపల్లా భూములు లాంటి వాటిని అప్పనంగా కొట్టేశారు కొందరు అధికార పార్టీ
నేతలు. విశాఖను రాజధాని చేస్తున్నామంటూ విలువైన భూములను కొల్లగొట్టేశారు కొందరు వైసీపీ పెద్దలు,ప్రభుత్వంలో చక్రం తిప్పే నేతలు.అందిన కాడికి భూములు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈనేపధ్యంలో అతిపెద్ద భూ దోపిడికి ప్లాన్ వేశారు రాజ్యసభ ఎంపీ, వైసీపీలోనే
నంబర్-2 అనే పేరున్న విజయసాయిరెడ్డి.కోట్ల విలువైన భూమిని కారుచౌకగా ప్రభుత్వం నుంచి పొందేందుకు మాస్టర్ స్కెచ్ వేశారు. భీమిలి నియోజకంలోని తర్లువాడలోవిద్యా సంస్థలు నిర్మిస్తామంటున్న విజయసాయిరెడ్డికి చెందిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.ఇంకేముంది..సీఎం జగన్ అండదండలతో శరవేగంగా కదిలింది ఆ ఫైల్.ప్రస్తుతం తుది దశలో ఉన్న ఆ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదమే తరువాయి అన్నట్లు ఉందన్న
విశ్వసనీయ సమాచారం టీవీ5 కి అందింది.కొంతకాలంగా సీఎం జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది. పార్టీ వ్యవహారాల్లో కూడాఅంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దసపల్లా,కార్తీకవనం,బే పార్క్,NCC,హాయగ్రీవ..రామానాయుడు స్టూడియో,భోగాపురం భూములు, రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డపేరు వచ్చింది.ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించిన జగన్ వైవి సుబ్బారెడ్డికి పగ్గాలు అప్పగించారు.అప్పటి నుంచి జగన్‌కి దూరంగా ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో కానీ హఠాత్తుగా మళ్లీ విజయసాయిరెడ్డి ప్రాభావం ఒక్కసారిగా పెరిగిపోయింది.తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే 300 కోట్ల భూ కేటాయింపు..రాజీసూత్రమా అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.
మరోవైపు తర్లుపాడు గ్రామంలోని కొండపై విష్ణుపాదాలు,దేవాలయం ఉన్నాయి. అక్కడ విగ్రహాలను కూడా గుర్తించారు గ్రామస్తులు.వరాహ నృసింహ స్వామి మొదట ఇక్కడే వెలసి..ఆ తర్వాత అడవివరం కొండపైకి వెళ్లినట్లు ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని తర్లువాడగా నామకరణం చేసినట్లు స్థానికులు అంటుంటారు. కొండపై 120 అడుగుల విగ్రహ ప్రతిష్టకు స్థానికుల ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కొండపై 10 ఎకరాల స్థలం చదును కూడా చేశారు గ్రామస్తులు. ఇంతటి చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈ విలువైన భూమిని విజయసాయిరెడ్డికి కట్టబెట్టతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
Tags
- vijay sai reddy
- vijaya sai reddy
- mp vijay sai reddy
- mp vijaya sai reddy
- vijayasai reddy
- ycp mp vijaya sai reddy
- ycp mp vijay sai reddy
- vijaya sai reddy speech
- ysrcp mp vijaya sai reddy
- mp vijayasai reddy
- government land grab
- mp vijayasai reddy daspalla land issue
- land grabbing
- vijay sai reddy over purandeswari issue
- vijay sai reddy latest news
- vijayasai reddy over daspalla lands issue
- vijay sai reddy about land scam
- vijayasai reddy land grabbing
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com